బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో వరల్డ్ ఒబెసిటీ డే కార్యక్రమం
ప్రస్తుతం నగరవాసుల్లో అత్యధికంగా కనిపిస్తున్నా ఊబకాయం సమస్యకు మారుతున్న ఆహారపు అలవాట్లే ప్రధాన కారకమని కేర్ ఆసుపత్రి బంజారాహిల్స్ బేరియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ వై కృష్ణ మోహన్ తెలిపారు. వరల్డ్ ఒబేసిటీ డే ను పురస్కరించుకొని కేర్ ఆసుపత్రిలో ఈ రోజు అవగాహన కార్యక్రమం నిర్వయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ గారు జ్యోతి ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఇటీవల మన నగరంలో కూడా ఊబకాయం తీవ్రత అధికంగా కనిపిస్తుందని దీనిని అరికట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రజలని చైతన్యవంతం చేస్తాయని దీన్నివలన ఊబయాకాన్ని అరికట్ట వచ్చని అన్నారు. ఈ సందర్బంగా డాక్టర్ వై కృష్ణ మోహన్ మాట్లాడుతూ మనమంతా ఆధునికత వైపు అడుగులు వేస్తూ ఆరోగ్యం విషయంలో వెనుకడుగు వేస్తున్నామన్నారు. జీవనశైలి మార్పులతో శారీరక శ్రమ లేకపోవడం, ఎలాంటి ఆహరం తీసుకుంటున్నామో తెలియని పరిస్థితి స్థూలకాయం, గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు లాంటి రోగాలు వస్తున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికే మనల్ని మనం కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుకోవాలని అయన సూచించారు.
ఇప్పుడు నిత్యజీవనవిధానములో ఆహారశైలిలో మార్పులు వచ్చాయి. ఫాస్ట్ ఫుడ్ జీవితంలో భాగమైపోయింది. నూనె వినియోగం పెరగడం , వ్యాయామం చేయకపోవడంతో బరువు పెరగడం సాధారణ సమస్య అయిపోయింది. కూర్చొని పనిచేసే ఒక్క వ్యక్తికీ రోజుకు 1300 క్యాలరీల ఆహరం తీసుకుంటే చాలు కానీ 1600 నుండి 2000 క్యాలరీలు శక్తి కలిగిన పదార్థాలను తీస్కుంటున్నారు. ఒకప్పుడు కేవలం 2 శాతం ఉన్న ఒబేసిటీ ఇప్పుడు 12 శాతానికి చేరుకుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునని ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మిస్టర్ జసదీప్ సింగ్ తెలిపారు.
స్థూలకాయం నివారణ కోసం పాఠశాలలు సామాజిక సేవ సంస్థలు జనసమూహాలున్న ప్రదేశాలకు వెళ్లి ఎలాంటి ఆహరం తింటే బరువు పెరుగుతారు! దీన్ని నివారించాలంటే ఏమి చేయాలి? స్థూలకాయం సమస్యలు నుంచి ఎలా గట్టెక్కాలన్న అంశాల గురించి ప్రజలలో నెలకొన్న అపోహలను నివృత్తి చేయాలనీ, శస్త్ర చికిత్స చేసుకొనే పరిస్థితి రాకుండా శారీరక వ్యాయం చేయాలి. ఆహార నియమాలు పాటించాలని ఊబకాయం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిదని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ మెదక్కర్ అభిప్రాయపడ్డారు.