డ‌యాబెటిక్ ఫుట్ కేర్‌ కోసం ప్ర‌త్యేక క్లినిక్‌

అందుబాటులోకి తీసుకొచ్చిన బంజారాహిల్స్ కేర్ హాస్పిట‌ల్‌

డ‌యాబెటిస్ వ‌ల్ల గుండె, కిడ్నీల వంటి ముఖ్య‌మైన అవ‌య‌వాలే కాకుండా ర‌క్త‌నాళాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీనివ‌ల్ల ఏర్ప‌డే స‌మ‌స్యే డ‌యాబెటిక్ అల్స‌ర్ లేదా డ‌యాబెటిక్ ఫుట్‌.

డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండ‌టంతో… దాని కాంప్లికేష‌న్ల బాధితులు కూడా పెరుగుతున్నారు. ఈ క్ర‌మంలో డ‌యాబెటిస్ వ‌ల్ల ఏర్ప‌డే డ‌యాబెటిక్ ఫుట్ కోసం బంజారా హిల్స్ కేర్ హాస్పిట‌ల్ లో ప్ర‌త్యేక క్లినిక్ ని ప్రారంభించారు.
డయాబెటిస్ రాజ‌ధాని అయిన హైద‌రాబాద్ లో డ‌యాబెటిస్ కాంప్లికేష‌న్ ల చికిత్సలు ఎప్ప‌టిక‌ప్పుడు అందుబాటులో ఉండాల్సిన అవ‌సరం ఉంది. మ‌ధుమేహం ఉన్న‌వాళ్ల‌లో ఇమ్యూనిటీ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి వాళ్ల‌కు ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా క‌ష్ట‌మే. అందుకే మ‌ధుమేహుల‌కు ఏ చిన్న గాయ‌మైనా అది త‌గ్గ‌డం క‌ష్టం అవుతుంది.

డ‌యాబెటిస్ వ‌ల్ల గుండె, కిడ్నీల వంటి ముఖ్య‌మైన అవ‌య‌వాలే కాకుండా ర‌క్త‌నాళాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీనివ‌ల్ల ఏర్ప‌డే స‌మ‌స్యే డ‌యాబెటిక్ అల్స‌ర్ లేదా డ‌యాబెటిక్ ఫుట్‌. మ‌ధుమేహం ఉన్న‌వాళ్ల‌లో పాదాల్లో పుండ్లు ఏర్ప‌డే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. ఇలాంటి పాదాన్నే డ‌యాబెటిక్ ఫుట్ అంటారు. చాలా సంద‌ర్భాల్లో ఈ స‌మ‌స్య గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఈలోగా పుండు పెద్ద‌దై, కాలు తీసేయాల్సిన ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. అందుకే దీని ప‌ట్ల అవ‌గాహ‌న పెంచ‌డానికి, స‌కాలంలో స‌రైన చికిత్స అందించ‌డానికి కేర్ హాస్పిట‌ల్ ఆధ్వ‌ర్యంలో డ‌యాబెటిక్ ఫుట్ అండ్ వూండ్ కేర్ క్లినిక్ ప్రారంభ‌మైంది. ఈ క్లినిక్ ని కేర్ ఔట్ పేషెంట్ విభాగంలో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడమీ ఇంచార్జి డైరెక్ట‌ర్ ఐపిఎస్ అమిత్ గార్గ్‌, కేర్ హాస్పిట‌ల్స్ గ్రూప్ సీఈఓ జ‌స్దీప్ సింగ్ చేతుల మీదుగా ఈ క్లినిక్ ప్రారంభోత్స‌వం జ‌రిగింది.

ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా వ‌చ్చిన‌ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్, శ్రీ అమిత్ గార్గ్ మాట్లాడుతూ, ఫుట్ & వుండ్ కేర్ క్లినిక్ ద్వారా డ‌యాబెటిక్ అల్స‌ర్‌, దాని కాంప్లికేష‌న్లు ఉన్న వ్య‌క్తుల‌కు అవ‌గాహ‌న పెంచ‌డం, స‌మ‌గ్ర‌మైన చికిత్స అందించాల‌నుకోవ‌డం సంతోష‌క‌రం అంటూ, కేర్ హాస్పిటల్స్ మరియు కేర్ వాస్కులర్ డిపార్ట్‌మెంట్‌ను ఆయన అభినందించారు.
డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్లు న్యూరోప‌తి, డాప్ల‌ర్ స్ట‌డీ, ఇత‌ర‌త్రా అన్ని ర‌కాల వైద్య సేవ‌లు కూడా ఈ ప్ర‌త్యేక‌మైన క్లినిక్ లోనే వినియోగించుకోవ‌చ్చ‌ని చెప్పారు కేర్ హాస్పిట‌ల్స్ సీఈఓ జ‌స్దీప్ సింగ్‌. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన రిపోర్టులు అప్ప‌టిక‌ప్పుడే అందుతాయ‌ని, అందువ‌ల్ల స‌కాలంలో గాయం పెద్ద‌ది కాక‌మునుపే ఒకేరోజులో స‌రైన చికిత్స పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు.

ప్రస్తుతం 40 ఏళ్లు దాటిన వారిలో సైతం డయాబెటిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. ఈ క్రమంలో ప్రతి 10 మందిలో ఆరుగురు షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారని రోజురోజుకూ ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండ‌టం వ‌ల్ల‌ ప్రతి 20 సెకన్లకు ఒక డ‌యాబెటిస్ పేషెంటు ఒక అవయవాన్ని కోల్పోతున్నారు. డ‌యాబెటిక్ ఫుట్ అల్స‌ర్ల వ‌ల్ల కాలు కోల్పోయే ప‌రిస్థితులు ఉండ‌టంతో ఈ స‌మ‌స్య మీద అవ‌గాహ‌న పెర‌గాల్సిన అవ‌సరం ఉంద‌న్నారు క్లినిక‌ల్ డైరెక్ట‌ర్, కేర్ వాస్కుల‌ర్ డిపార్ట్‌మెంట్ క్లినిక‌ల్ డైరెక్ట‌ర్‌, వాస్కుల‌ర్ సొసైటీ ఆఫ్ ఇండియా, వ‌ర‌ల్డ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ వాస్కుల‌ర్ సొసైటీస్‌ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ పి.సి. గుప్తా.

కేర్ ఔట్ పేషెంట్ విభాగంలో వాస్కులర్ & ఎండోవాస్కులర్ సర్జన్‌లు, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్‌లు, ప్లాస్టిక్ & డయాబెటిక్ ఫుట్ సర్జన్‌లు, వుండ్ కేర్ నర్సులు, క్లినికల్ సైకాలజిస్ట్‌లు, అనస్తీషియాలజిస్టులతో కూడిన మల్టీడిసిప్లినరీ టీమ్‌తో డయాబెటిక్ ఫుట్ & వుండ్ కేర్ క్లినిక్ సేవలను అందించ‌నున్నామ‌ని డాక్టర్ పి. సి. గుప్తా తెలిపారు.

Spread the love

Recommended For You

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *