హిస్టరెక్టమీలో కొత్త టెక్నిక్ !

పరిశోధనలంటే పాశ్చాత్యులే కాదు.. మన భారతీయులు కూడా ముందున్నారు. కానీ సాధారణంగా వాళ్ల పరిశోధనలకు పెద్దగా ప్రాచుర్యం లభించదు. కానీ హైదరాబాద్‌లోని కేర్‌ హాస్పిటల్‌కి చెందిన సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ విపిన్‌ గోయల్‌ తన పరిశోధనకు గొప్ప ప్రాచుర్యం పొందారు. గర్భసంచి లోపలి పొరపై ఏర్పడిన క్యాన్సర్ కణితిని తొలగించేందుకు చేసే లాపరోస్కోపీలో ఆయన కొత్త పద్ధతి కనుక్కున్నారు.

ఇందుకు గాను ఆ సర్జరీ పద్ధతికి ఆయన పేరు పెట్టారు. గోయల్స్‌ టెక్నిక్‌ ఆఫ్‌ లాపరోస్కోపిక్‌ హిస్టరెక్టమీ ఫర్‌ ఎండోమెట్రియం కార్సినోమా పేరుతో దానికి ప్రాచుర్యం లభిస్తున్నది. అంతేకాదు, కార్సినోమా ఇంటర్నేషనల్‌ సర్జరీ జర్నల్‌లో ఆయన కొత్త సర్జరీ విధానం గురించి ప్రచురితమైంది. ఇంతకీ ఆయన కనిపెట్టిన ఆ కొత్త రకం లాపరోస్కోపిక్‌ హిస్టరెక్టమీ ఏంటంటే…..

స్త్రీలను వేధించే కాన్సర్ లలో రొమ్ము, సర్వీకల్ తర్వాత గర్భసంచి కాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నది. ఇలాంటప్పుడు చాలా సందర్భాలలో హిస్టరెక్టమీ ద్వారా గర్భసంచిని తొలగించాల్సి వస్తుంది. గర్భసంచిని తొలగించడానికి మూడు రకాల పద్దతుల్లో హిస్టరెక్టమీ చేస్తారు. గతంలో అయితే కేవలం అబ్డామినల్‌ హిస్టరెక్టమీ మాత్రమే చేసేవాళ్లు. ఈ పద్ధతిలో పొట్టను ఓపెన్‌ చేసి గర్భసంచి తీసేయాల్సి ఉంటుంది. మరో పద్ధతి వెజైనల్‌ హిస్టరెక్టమీ. ఇది మినిమల్లీ ఇన్వేసివ్‌ పద్ధతి. లాపరోస్కోపీ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత లాపరోస్కోపిక్‌ హిస్టరెక్టమీ చేస్తున్నారు. క్యాన్సర్‌ ఏర్పడినప్పుడు మాత్రమే కాకుండా ఎండోమెట్రియాసిస్‌, అధెషన్స్‌ లాంటి సమస్యలున్నప్పుడు కూడా గర్భసంచి తీసేయాల్సి వస్తుంది.

ఏమిటీ టెక్నిక్‌?

గోయల్స్‌ టెక్నిక్‌ ఆఫ్‌ లాపరోస్కోపిక్‌ హిస్టరెక్టమీ ఫర్‌ ఎండోమెట్రియం కార్సినోమా.. అంటే గర్భసంచి లోపలి పొరపై వచ్చే క్యాన్సర్‌ కణితిని తొలగించడానికి లాపరోస్కోపీ ద్వారా చేసే హిస్టరెక్టమీలో గోయల్‌ టెక్నిక్‌ అన్నమాట. మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీల్లో లాపరోస్కోపీని ఎక్కువగా వాడుతున్నారు. ఈ సర్జరీలో చిన్నచిన్న తేడాలు ఉన్నప్పటికీ డాక్టర్‌ గోయల్‌ టెక్నిక్‌లో మరింత వైవిధ్యం ఉంది. సర్జరీని పది దశల్లో చేస్తారు. లాపరోస్కోపీ ద్వారా చిన్న చిన్న రంధ్రాలు పెడతారు. అప్పటి నుంచి శస్త్రచికిత్స పూర్తయ్యేవరకు ఈ పది దశలుంటాయి. వీటిలో వెజైనల్‌ మానిప్యులేటర్లు లేదా మయోమా స్క్రూలను వినియోగిస్తారు. వీటిని ఉపయోగించకుండా శస్త్రచికిత్స నిర్వహించడమే డాక్టర్‌ గోయల్స్‌ టెక్నిక్‌లో ఇమిడివున్న అంశం. క్యాన్సర్‌ చికిత్సలో ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

సురక్షితంగా హిస్టరెక్టమీ…

• గర్భసంచి లోపలి కణితి కణజాలం తీసేసేటప్పుడు దాన్ని తిప్పడానికి వెజైనల్‌ మానిప్యులేటర్లను ఉపయోగిస్తారు. వీటివల్ల ఇవి గర్భసంచి కుహరంలోని క్యాన్సర్‌ కణాలతో పాటుగా ఇతర ఆరోగ్య కణజాలంపై కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే ఆ కణజాలంలో పగుళ్లు ఏర్పడి రక్తస్రావం కావొచ్చు. దీనివల్ల క్యాన్సర్‌ కణాలు పగుళ్లు ఏర్పడిన ఆరోగ్య కణజాలంలోని రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు విస్తరించే ప్రమాదం ఉంటుంది. గోయల్‌ విధానంలో వెజైనల్‌ మానిప్యులేటర్లను వాడకపోవడం వల్ల ఈ ప్రమాదం తప్పుతుంది.
సాధారణంగా సర్జరీ చేసేటప్పుడు ఇతర శరీర భాగాలు ఎక్కడున్నాయో సరిగా గుర్తించి, వాటికి హాని కలుగకుండా జాగ్రత్తపడుతారు. కాని కొన్నిసార్లు ఇతర అవయవాలకు గాయం కావొచ్చు. గోయల్‌ టెక్నిక్‌ ద్వారా అలాంటి సమస్య ఉండదు. హిస్టరెక్టమీ నిర్వహించేటప్పుడు బ్లాడర్‌, మూత్రనాళం, రెక్టమ్‌ వంటి భాగాలకు హాని కలుగకుండా సురక్షితంగా ఉంచుతుంది.
• ఇలాంటి సమస్యల శాతాన్ని తగ్గించేందుకు ఈ టెక్నిక్‌ను ఇప్పుడు ప్రామాణిక వైద్యవిధానంలో చేర్చారు.

డాక్టర్ విపిన్ గోయల్
Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *