ఇక్కడికి వెళ్తే వెన్నునొప్పులు పరార్‌!

నడుము నొప్పి…, వెన్ను నొప్పి…., సయాటికా…. దీర్ఘకాలం వేధించే ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్లకు ఊరటనివ్వడానికి ఆదివారం ప్రారంభం జరిగింది. హెల్త్‌ హబ్‌గా పేరున్న హైదరాబాద్‌ అనే హారానికి మరో మాణిక్యం చేరింది. ఏషియన్‌ స్పైన్‌ హాస్పిటల్‌ ఇందుకు వేదిక అయింది. వెన్నుపాము, దాని సంబంధిత నొప్పుల కోసం ప్రత్యేకంగా ప్రారంభమైన ఈ స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ సెంటర్‌ భారతదేశంలోనే ప్రథమమైంది. ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఫౌండర్‌, ఛైర్మన్‌ డాక్టర్‌ డి. నాగేశ్వర్‌ రెడ్డి ఆదివారం నాడు ఈ హాస్పిటల్‌ను ప్రారంభించారు. సాధారణంగా పేషెంట్లు హాస్పిటల్‌కి రావడానికి వెనుకంజ వేస్తారు. ఏ సర్జరీ కోసమో ఇక హాస్పిటల్‌లో చేరాల్సి వస్తే ఎప్పుడు అక్కడి నుంచి బయటపడతామా అని ఎదురుచూస్తారు. వ్యాధి పట్ల భయంతో మాత్రమే కాదు.. హాస్పిటల్‌ వాతావరణం కూడా ఇందుకు కారణమే. ఏషియన్‌ స్పైన్‌ సెంటర్‌ మాత్రం అలా కాదు. మంచి లేక్‌ వ్యూ, ఆధునిక హంగులతో ఇంట్లోనో, ఏదైనా పెద్ద హోటల్‌లోనో ఉన్న ఫీలింగ్‌ కలిగిస్తుందన్నారాయన. రోగి సంరక్షణ, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, అత్యాధునిక వైద్య పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి వెన్నుపాము సమస్యలకు పూర్తి స్థాయి చికిత్సను అందించడమే లక్ష్యంగా ఈ హాస్పిటల్‌ ప్రారంభమైంది. ఆధునిక వైద్య విధానమైన ఎండోస్కోపిక్‌ పద్ధతిలో వెన్నుపాము చికిత్సలను అందించడంలో ఇది అగ్రగామిగా ఉంటుందన్నారు ఈ హాస్పిటల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుకుమార్‌ సూర. మెడికల్‌ టెక్కీగా పేరున్న నరేశ్‌ కుమార్‌ పగిడిమర్రితో కలిసి ఆయన దీన్ని స్థాపించారు.

వెన్నుపాము సమస్యలకు అనేక రకాల అపోహలున్నాయి. అలాంటి అపోహలను తొలగించడమే ధ్యేయంగా తమ వైద్యం ఉంటుందన్నారు డాక్టర్‌ సుకుమార్‌ సూర. మారిన జీవనశైలి, తీవ్రమైన ఒత్తిడి, సరైన నిద్ర, ఆహారపు అలవాట్లు లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం లాంటి అలవాట్లు వెన్నుపాము సమస్యలు పెరగడానికి కారణమవుతున్నాయని చెప్పారాయన. ఏషియన్‌ స్పైన్‌ హాస్పిటల్‌లో మెడ, వెన్ను, నడుము నొప్పి లాంటి అనేక రకాల వెన్నెముక సంబంధిత సమస్యలకు సంపూర్ణ చికిత్సలను అందిస్తాం. సర్వైకల్‌ స్పాండిలోసిస్‌, ఎముక స్పైర్‌, క్రానిక్‌ వెర్టిబ్రల్‌ జంక్షన్‌ అనోమాలిస్‌, డీజనరేటివ్‌ డిస్క్‌ డిసీజ్‌ లాంటి వ్యాధులకు సరైన పరిష్కారం ఇక్కడ లభిస్తుందన్నారాయన. పూర్తి స్థాయి ఎండోస్కోపిక్‌ వెన్నుపాము శస్త్రచికిత్సల కోసం సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌గా ఆర్‌ఐడబ్ల్యువో స్పైన్‌, జర్మనీ ద్వారా ఇది గుర్తింపు పొందింది. పూర్తి 4కె ఇమేజింగ్‌ టెక్నీలజీ, ఇంట్రా ఎండోస్కోపిక్‌ స్పైన్‌ సర్జికల్‌ ఇన్నోవేషన్‌, ఎండోస్కోపిక్‌ స్పైన్‌ సర్జరీ కోసం ప్రత్యేక ట్రెయినింగ్‌ సెంటర్‌ని కూడా ప్రారంభించామని చెప్పారు ఏషియన్‌ స్పైన్‌ హాస్పిటల్‌ సీఈవో నరేశ్‌ కుమార్‌. ఇక్కడ ప్రత్యేక ఫిజియోథెరపీ, యోగా విభాగాలు కూడా ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో మాక్సివిజన్‌ ఐ హాస్పిటల్‌ ఫౌండర్‌, కోఛైర్మన్‌ డాక్టర్‌ కాసు ప్రసాద్‌ రెడ్డి, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ నరసింహన్‌, సిడీఎఫ్‌డి డైరెక్టర్‌ డాక్టర్‌ కె. తంగరాజ్‌, సీనియర్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ మురళీ జయరామన్‌ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

దీర్ఘకాలిక వెన్నుపాము సమస్యలకు సరైన ఆధునిక చికిత్స పొందాలనుకుంటే జూబ్లీహిల్స్‌లోని ఏషియన్‌ స్పైన్‌ సెంటర్‌కి వెళ్లండి.

Spread the love

Recommended For You

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *