బ్రెయిన్ సర్జరీ..ఇంత సులువా !

మొట్టమొదటి రోబోటిక్ థర్మో అబ్లేటివ్ సర్జరీ.. ఏఐజీలో

బ్రెయిన్ కి సర్జరీ చేయాలంటే కోత ఒక్క నానో మీటర్ కూడా అటూ ఇటూ పోకూడదు. లేకుండే నరాలు డ్యామేజీ అవుతాయి. అందుకే మెదడుకు సంబంధించిన సర్జరీల్లో రోబోటిక్స్ రావడం అంటే అత్యంత సంతోషకరమైన వార్త. రోబోటిక్స్ సాయంతో మొట్టమొదటి థర్మో అబ్లేటివ్ డిస్ కనెక్ట్ సర్జరీ చేసి వార్తల్లో నిలిచింది ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ.

కొన్నిసార్లు క్యాన్సర్ కాకపోయినప్పటికీ, కొన్ని రకాల కణుతులు తీవ్రమైన సమస్యల్ని సృష్టిస్తాయి. అందుకే మెదడులో ఏర్పడే ఇటువంటి కణుతులు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సమస్యలు కలిగిస్తాయి. ఫిట్స్, ఒకవైపు కాలూ, చెయ్యీ బలహీనం కావడం, చివరికి పక్షవాతానికి దారితీయొచ్చు. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావొచ్చు. అందుకే మాలిగ్నెంట్ కాకపోయినప్పటికీ ఇలాంటి కణుతులను తొలగించడం అత్యంత అవసరం. అంతేకాదు, ఎంత త్వరగా వీటిని తొలగిస్తే, అంత సేఫ్ గా ఉంటారు. కానీ మెదడుకు సర్జరీ అంటే చాలామందిలో భయం ఉంటుంది. కానీ ఇప్పుడొచ్చిన ఆధునిక చికిత్సలు బ్రెయిన్ సర్జరీలను కూడా సులువు చేశాయి. రోబోటిక్ టెక్నాలజీ పెరిగిన తర్వాత బ్రెయిన్ సర్జరీలు కూడా చాలా సేఫ్ అయ్యాయి. వాటి వల్ల దుష్ప్రభావాలు కూడా దాదాపు జీరో అయ్యాయి.

డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ వల్ల హైపోథాలమిక్ హమార్టోమాతో బాధపడుతున్న ఓ పేషెంటుకి చేసిన ఈ రోబోటిక్ థర్మో అబ్లేటివ్ డిస్ కనెక్ట్ సర్జరీ మెదడుకు సంబంధించిన ఆపరేషన్లలో మరో మైల్ స్టోన్. ఇటువంటి సంక్లిష్టమైన సమస్య ఉన్న వాళ్లలో ఇది కొత్త ఆశలకు పునాది వేసింది.

ఏమిటీ జబ్బు?

మెదడులోని కీలకభాగమైన హైపోథాలమస్ దగ్గర కణితి ఏర్పడినప్పుడు హైపోథాలమిక్ హమార్టోమాగా వ్యవహరిస్తారు. ఇది క్యాన్సర్ కణితి కాదు. కానీ కణితి లాంటి వైకల్యం. ఇది అరుదుగా కనిపిస్తుంది. దీనివల్ల డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ (మూర్ఛ), కాగ్నిటివ్ ఇంపెయిర్ మెంట్, ఇతర న్యూరలాజికల్ లక్షణాలు ఉంటాయి. ఈ సమస్యకు ఉన్న చికిత్సలు చాలా పరిమితమైనవి. దీర్ఘకాల ఉపశమనానికి ఇవి పనికిరావు.

ఇదీ ఈ కొత్త సర్జరీ..

హైపోథాలమస్ లో ఏర్పడ్డ ఈ కణితిని థర్మోఅబ్లేషన్ ద్వారా తొలగించడమే ఈ సర్జరీ. అయితే దీనికి రోబోటిక్స్ టెక్నాలజీని ఉపయోగించారు. కాబట్టి సర్జరీ తర్వాత సైడ్ ఎఫెక్టులు చాలావరకు ఉండవు. అధునాతన ఇమేజింగ్, అబ్లేషన్ టెక్నాలజీని కలిపి వాడటం వల్ల ఇదొక మినిమల్లీ ఇన్వేసివ్ చికిత్స. పెద్ద పెద్ద కోతలుండవు. రోబోటిక్స్ వల్ల కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల చాలా కచ్చితమైన కటింగ్ ఉంటుంది. అంటే హీట్ ని ఉపయోగించి, చుట్టు పక్కల కణజాలాల నుంచి ఈ అబ్ నార్మల్ కణితిని కట్ చేస్తారు. తద్వారా ఆరోగ్యకరమైన కణజాలంపై ప్రభావం ఉండదు. కాబట్టి రోగి త్వరగా కోలుకుంటారు. దీర్ఘకాల ఉపశమనం పొందగలుగుతారు. ఈ సర్జరీ కోసం న్యూరో సర్జికల్ టీమ్ డైరెక్టర్ & హెడ్ డా. సుబోధ్ రాజు, డాక్టర్ రఘు సామల కన్సల్టెంట్ ఎపిలెప్సీ అండ్ ఫంక్షనల్ న్యూరోసర్జరీ నేతృత్వంలో న్యూరో సర్జన్లు, న్యూరాలజిస్టులు, న్యూరోఅనెస్తీషియాలజిస్టుల మల్టీడిసిప్లినరీ బృందం నేతృత్వంలో, AIG హాస్పిటల్స్‌లోని న్యూరోసర్జరీ మరియు స్పైన్ సర్జరీ విభాగానికి చెందిన వైద్యులు కలిసి పనిచేశారు.

Spread the love

Recommended For You

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *