ఏదో ఒక పండు రోజుకోటి అయినా తినాలంటారు డాక్టర్లు. ప్రతిరోజూ యాపిల్ పండు తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరమే ఉండదని కూడా చెప్తారు. అయితే దీన్ని ఏ సమయంలో తీసుకుంటే ఎక్కువ లాభమనే విషయాన్ని న్యూట్రిషనిస్టులు ఇలా చెప్తున్నారు.
శరీరానికి కావాలసిన సూక్ష్మపోషకాలను అందించడంలో పండ్లు ముందుంటాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమయ్యే ఫైబర్ కూడా ఫ్రూట్స్ లో ఎక్కువగా ఉంటుంది. పండ్లలో రారాజు మామిడి అయినా సంపూర్ణ పోషకాలనూ, ఆరోగ్యాన్ని ఇవ్వడంలో మాత్రం యాపిల్ దే అగ్రస్థానం.
అయితే దీన్ని ఉదయం పూట తినడమే బెస్ట్ అంటున్నారు. యాపిల్ పండు తొక్కలో ఫైబర్ పెక్టిన్ ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాదు ఇది క్యాన్సర్ కారక పదార్థాలను తొలగిస్తుంది. యాపిల్ పండును ఉదయం తింటేనే ఈ లాభాలు కలుగుతాయి. యాపిల్ ను సాయంకాలం గానీ, రాత్రిపూట గానీ తినొద్దు. అలా తింటే యాపిల్ లోని ఆర్గానిక్ యాసిడ్స్ పెరుగుతాయి. ఇవి జీర్ణ కోశంలో అసౌకర్యానికి కారణమవుతాయి. అంతేకాదు పెక్టిన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి రాత్రిపూట డైజెస్టివ్ సిస్టమ్ మీద భారం పెంచుతుంది.