గ్రీన్ టీ.. ఈ టైమ్ లో తాగితే.. ఇక అంతే..!

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే, ఎప్పుడు పడితే అప్పుడు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యం సంగతి అటుంచి.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నవారవుతారు. మితిమీరి తాగితే గ్రీన్ టీ కూడా నెగటివ్ ప్రభావాలను చూపిస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

అందరికీ ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఏవి తినాలి? ఏం తాగాలి అంటూ ఆరోగ్య ప్రయోజనాలను వెతికిపట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ టీ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. దీన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేలడంతో ప్రతీ ఒక్కరూ గ్రీన్ టీ తాగుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, అందమైన చర్మం కావాలనుకునేవారు గ్రీన్ టీని ఇష్టంగా తాగి ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే, మంచిది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. అలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

ఖాళీ కడుపుతో వద్దు

పొద్దున్నే మొహం కడుక్కోగానే టీ తాగడం మనకి అలవాటు. కానీ ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే అందులోని కెఫీన్, టానిన్స్ జీర్ణక్రియపై తీవ్రప్రభావం చూపుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. గ్రీన్ టీలోని టానిన్ అనే కంటెంట్ జీర్ణాశయంలో ఎక్కువ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. అదే విధంగా పడుకునే ముందు కూడా గ్రీన్ టీ తీసుకోకూడదు.. ఇందులోని అమినో యాసిడ్స్ కండరాలను ఉత్తేజపరిచి నిద్రపోకుండా ప్రేరేపిస్తాయి.

శరీర బరువుని అదుపులో ఉంచి రక్తాన్ని మెరుగుపరుస్తుందని చాలామంది గ్రీన్ టీని తాగుతారు. అయితే ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే చాలామంచిది లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్రీన్ టీ మోతాదుకు మించి తీసుకోకూడదు. రోజుకి 2 కప్పుల మించి గ్రీన్ టీ తాగితే.. అది శరీరంపై నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది.

ఎప్పుడు తాగాలి..?

గ్రీన్ టీ ఎప్పుడు కూడా భోజనానికి అరగంట ముందు.. భోజనం తర్వాత రెండు గంటల తర్వాత తీసుకోవడం వల్ల చక్కని లాభాలుంటాయని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా, ఎక్సర్‌సైజ్ చేసేవారు.. వ్యాయామానికి ముందు గ్రీన్ టీ తీసుకుంటే వర్కౌట్స్ ఎక్కువసమయం చేయగలుగుతారు.

గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ హార్మోనులను విడగొడతాయి. దీంతో గ్రంథుల్లో మార్పులు వస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. గ్రీన్ టీ కొన్ని సమ్మేళనాలు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. కాబట్టి ఈ డ్రింక్‌ని ఉదయాన్నే తీసుకోవాలి. అలా కాకుండా సాయంత్రం సమయాల్లో తీసుకుంటే నిద్రలేమి సమస్య వస్తుంది.

Spread the love

Recommended For You

About the Author: health diary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *