థైరాయిడ్ సమస్య ఇటీవలి కాలంలో ఒక మాడ్రన్ డిసీజ్ అయిపోయింది. లావుగా ఉన్నవాళ్లను ఎవరిని కదిలించినా థైరాయిడ్ సమస్య ఉందనే అంటున్నారు. అయొడైజ్డ్ ఉప్పు పరిమితికి మించి వాడటమే ఇందుకు కారణమని ఇటీవల హోమియో వైద్యులు చేసిన అధ్యయనంలో తేలింది. అయితే హోమియోవైద్య విధానంలో థైరాయిడ్ సమస్యలను శాశ్వతంగా తగ్గించే మందులు ఉన్నాయంటున్నారు. ఇటీవలి కాలంలో ఇవి ఎందుకు పెరిగిపోయాయి? థైరాయిడ్ సమస్యకి హోమియోపతి అందిస్తున్న పరిష్కారం ఏంటి?
థైరాయిడ్ సమస్యల్లో హైపోథైరాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. అంటే థైరాయిడ్ గ్రంథి తక్కువ పనిచేయడం. ఎక్కువగా పనిచేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజమ్ అంటారు. హైపర్ థైరాయిడ్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. కాని వెయ్యిమందిలో ఒకరికి హైపర్ థైరాయిడ్ వ్యాధి వస్తుంది. 80 శాతం మందిలో వచ్చే హైపోథైరాయిడిజమ్ అంత ప్రమాదకరమైందేమీ కాదు. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే థైరాక్సిన్ హార్మోన్ బేసల్ మెటబాలిక్ రేటును కంట్రోల్ చేస్తుంది. దీని లోపం రావడం వల్ల బిఎంఆర్ రేటు పడిపోయి, జీర్ణశక్తి సరిగా ఉండదు. ఆకలి సరిగా ఉండదు. తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కావల్సిన ఎనర్జీ రాదు. అందుకే బరువు పెరుగుతారు గానీ ఎనర్జీ లెవల్స్ తక్కువ ఉంటాయి. హైపోథైరాయిడ్ సమస్య ఎక్కువ శాతం స్త్రీలలో కనబడుతుంటుంది. బరువు పెరగడం దీనికి మొదటి సంకేతం. నెలసరి సమస్యలు, పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవటం జరుగుతుంది. చర్మం పొడిబారిపోతుంది. కొందరిలో గొంతు కూడా మారుతుంది. బొంగురుపోయినట్టుగా ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉంటుంది. మలబద్దకం ఉంటుంది. ఇవన్నీ థైరాయిడ్ లోపం వల్ల వచ్చేవి. హైపోథైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు అవసరమైనంత మేరకు థైరాక్సిన్ హార్మోన్ ఉండదు. కాబట్టి దీన్ని టాబ్లెట్ల రూపంలో ఇస్తారు డాక్టర్లు. అంటే థైరాయిడ్ పనిచేయడం లేదు కాబట్టి వేరే మందిచ్చి, అది థైరాయిడ్ పని చేసేట్టుగా చేస్తారన్నమాట. థైరాయిడ్ లోపాన్ని బట్టి థైరాయిడ్ టాబ్లెట్లు ఎన్ని గ్రాములు తీసుకోవాలనేది చెప్తారు.
సమస్య మూలానికే చికిత్స
హోమియోపతి సిద్ధాంతం ప్రకారం అసలు థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడానికి మూల కారణం ఏంటి అన్నది ఇంపార్టెంట్. టాబ్లెట్ రూపంలో హార్మోన్ ని ఇవ్వడం కాకుండా థైరాయిడ్ గ్రంథే సక్రమంగా పనిచేసేట్టు చేస్తే, అది వందశాతం థైరాక్సిన్ ని ప్రొడ్యూస్ చేసేట్టుగా చేస్తే మళ్లీ మళ్లీ ప్రాబ్లం రాదనేది ఈ సిద్ధాంతం. దీని ప్రకారం పేషెంటు లక్షణాలను దృష్టి లో పెట్టుకుని ఏ మందు ఇస్తే ఆ పేషెంటుకు బావుంటుందని ఆలోచించి ఆ ప్రకారమే ట్రీట్ చేస్తారు. ఇలా కొన్నాళ్ల చికిత్స తరువాత థైరాయిడ్ గ్రంథి స్టిమ్యులేట్ అయ్యి, బాగా పనిచేయడం మొదలుపెడుతుంది. మెల్లమెల్లగా నార్మల్ స్టేజికి వచ్చేస్తారు. మా దగ్గరికి వచ్చేవాళ్లలో వందశాతం మంది థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకునేవాళ్లే వస్తుంటారు. హోమియో చికిత్స మొదలుపెట్టినంత మాత్రాన అకస్మాత్తుగా ఆ మందులు ఆపొద్దు. కానీ వాళ్ల పరిస్థితిని బట్టి డోసేజీ తగ్గిస్తాం. థైరాక్సిన్ టాబ్లెట్‌తో పాటుగా హోమియోపతి మందులు కూడా వాడాల్సి ఉంటుంది.
హోమియోతో పూర్తిగా నయం
సాధారణంగా థైరాయిడ్ సమస్య వచ్చిందంటే ఇక మందులు లైఫ్ లాంగ్ వేసుకోమంటుంటారు. కాని హోమియో వైద్య విధానంలో మందులు లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాధి తీవ్రతను బట్టి 6 నెలల నుంచి ఒకటిన్నర సంవత్సరం దాకా ట్రీట్మెంట్ ఇస్తారు. సాధారణంగా మళ్లీ తిరగబెట్టడం జరగదు. ఎప్పుడన్నా ఏవన్నా లక్షణాలు కనబడినా మళ్లీ ఒక రెండు మూడు నెలలు మందులు వాడితే తగ్గిపోతుంది. అంతేగానీ జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఆటోఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధితో పాటు థైరాయిడ్ సమస్యలన్నింటికీ హోమియోలో మంచి మందులున్నాయి. వీటిలో.. హోమియోపతిక్ థైరాయిడినమ్, పొటెన్షియడైజ్డ్ థైరాయిడినమ్ అనేవి ఉంటాయి. ఇవి కాకుండా సింప్టమాటిక్ చికిత్సగా గ్రాఫైట్ అనే మందును కూడా ఇస్తారు. ఇది థైరాయిడ్ లోపం ఉన్న పేషెంట్స్ కి బాగా పనిచేస్తుంది. చాలాసార్లు దీనివల్ల మంచి ఫలితాలుంటాయి. అధిక బరువు, చర్మం పొడిబారడం, అధిక చెమట, నెలసరి సమస్యలున్న వాళ్లకు కాల్కేరియా కార్బ్ బాగా పనిచేస్తుంది. లక్షణాలు, పేషెంటు తత్వం బట్టి మందులిస్తే 99 శాతం వరకు థైరాయిడ్‌ని తగ్గించవచ్చు. చికిత్సతో పాటుగా కొవ్వు పదార్థాలు తగ్గించడం, స్వీట్లు తగ్గించడం, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, నీళ్లు ఎక్కువగా తాగడం వంటివి పాటిస్తే తొందరగా సమస్య నుంచి బయటపడవచ్చు.
అయొడైజ్డ్ ఉప్పే అసలు సమస్య
పదిహేను ఇరవయ్యేళ్ల క్రితం థైరాయిడ్ సమస్యలు ఇంత ఎక్కువగా లేవు. ఇప్పుడు మాత్రం హోమియో వైద్యం కోసం వచ్చే ప్రతి వంద పేషెంట్లలో 80 మందికి థైరాయిడ్ ఉంటోంది. ఇందుకు గల కారణాల్లో అయొడైజ్డ్ సాల్ట్ తినడం కూడా ఒకటని మన దగ్గర చేసిన అధ్యయనంలో తేలింది. అందుకే అయొడైజ్డ్ సాల్ట్ బదులుగా రాక్ సాల్ట్ తీసుకోవడమే మంచిది. మా క్లినిక్ లో స్టాటిస్టిక్స్ తీస్తే చాలామంది పేషెంట్లు థైరాయిడ్ తో వస్తున్నారు. 20 ఏళ్లక్రితం రెండు మూడు కేసులు వచ్చేవి. ఇవాళ ప్రతిరోజు ఒక పేషెంటు. ఏదో ప్రాబ్లం తో వస్తారు. కాని థైరాయిడ్ కూడా ఉంటోంది. ఎందుకిలా పెరిగిందని స్టడీ చేశాం. అయోడిన్ థైరాక్సిన్ తయారీకి హెల్ప్ చేస్తుంది. దీని లోపం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుందని మనకు తెలిసిందే. అయితే అయొడిన్ అవసరానికి మించి తీసుకున్నా కూడా హైపోథైరాయిడ్ ఉండే అవకాశం ఉందని ఈ స్టడీలో ఒక అవగాహనకు వచ్చాం. మనం దాదాపు 25 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరం అయోడైజ్డ్ సాల్ట్ తింటున్నాం. మన ప్రభుత్వం అయొడైజ్డ్ సాల్ట్‌ని తప్పనిసరి చేసింది. అందువల్ల ప్రతి ఒక్కరు అవసరం ఉన్నా లేకపోయినా, బాడీలో అయోడిన్ డెఫీషియన్సీ ఉందా లేదా అనేది కూడా చూసుకోకుండా రోజూ అయోడిన్ తింటున్నారు. దాంతో మైల్డ్‌గా అయొడిన్ పాయిజనింగ్ అయ్యి హైపోథైరాయిడ్ రావొచ్చని హోమియో లిటరేచర్‌లో కూడా ఉంది. అందుకే అయొడిన్ లేని మామూలు ఉప్పు, దొడ్డు ఉప్పు తీస్కోవాలి. అయోడిన్ ఉన్న ఉప్పు అప్పుడప్పుడు తింటే పరవాలేదు. రెగ్యులర్‌గా మాత్రం వద్దు.