క్యాన్సర్.. ఇక సైడ్ ఎఫెక్టులుండవ్..!

ఏది తిందామన్నా గొంతు దిగదు.. నోట్లో ఏది పెట్టినా వాంతి అయిపోతుంది. మరోవైపు సరైన పోషకాహారం అందక శక్తి సన్నగిల్లుతుంది. పదే పదే ఇన్ ఫెక్షన్లు వస్తుంటాయి… ఇదీ క్యాన్సర్ చికిత్స తీసుకునేవాళ్ల పరిస్థితి. క్యాన్సర్ కు ఎన్ని ఆధునిక చికిత్సలు వచ్చినప్పటికీ ఇలాంటి సైడ్ ఎఫెక్టుల వల్లనే క్యాన్సర్ భయం పోవడం లేదు. ఇప్పుడు దీనికి పరిష్కారం దొరికింది. సైడ్ ఎఫెక్టులను తగ్గించే ఇంటిగ్రేటివ్ క్యాన్సర్ థెరపీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

వైద్యుడు ఎంత గొప్ప నిపుణుడైనా సరే.. ఆ వైద్యాన్ని అందుకోవడానికి రోగి మానసికంగా కూడా సిద్ధంగా ఉన్నప్పుడే చికిత్స మంచి ఫలితాలనిస్తుందంటారు. క్యాన్సర్ చికిత్సలో ఇది వంద శాతం సరైనది. కాన్సర్ చికిత్స సత్ఫలితాలను ఇవ్వాలంటే మనోధైర్యం, మనసు ఒత్తిడి లేకుండా ఉండటం కూడా అవసరమే. ఇంటిగ్రేటివ్ కాన్సర్ థెరపీ ఇందుకు ఉపయోగపడుతుంది. క్యాన్సర్ చికిత్సకు ముందు, చికిత్స తీసుకునేటప్పుడు, చికిత్స తరువాత కూడా వెల్ నెస్ సీకర్ (పేషెంటు)ను అందుకు సన్నద్ధం చేయడానికి ఇంటిగ్రేటివ్ క్యాన్సర్ థెరపీ తోడ్పడుతుంది.

ఇంటిగ్రేటివ్ క్యాన్సర్ థెరపీ అంటే..?

కొందరికి చిన్న దెబ్బ తగిలినా విలవిలలాడిపోతారు. ఎంత పెద్ద దెబ్బకైనా చెక్కుచెదరకుండా ఉంటారు మరికొందరు. ఒకే రకమైన శరీరం అయినప్పటికీ వారి మానసిక దృఢత్వంలో ఉన్న తేడాయే వాళ్లు ఆ దెబ్బను తట్టుకోవడంలో వైవిధ్యానికి కారణం. క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలంటే ముందుగా మానసిక స్థైర్యం చాలా ముఖ్యం. ఇందుకోసం మనసు ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. తద్వారా చికిత్సకు త్వరగా రెస్పాండ్ అవుతారు. నెగటివ్ ఆలోచనలను పోగొట్టేలా, నిరాశ నుంచి బయటికి తీసుకువచ్చేందుకు కౌన్సెలింగ్ ఉపయోగపడుతుంది. సంప్రదాయిక చికిత్సలైన కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సల వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులను తగ్గించడానికి కాంప్లిమెంటరీ థెరపీలు సహాయపడుతాయి. ఈ అన్ని కోణాల్లో పనిచేసే థెరపీలన్నింటినీ అలోపతి పద్ధతులకు జోడించి, సంపూర్ణ చికిత్సను అందించడమే ఇంటిగ్రేటివ్ క్యాన్సర్ (ఆంకో) థెరపీ.

ఏమిటవి..?

ఇంటిగ్రేవివ్ ఆంకో థెరపీ చికిత్సలను క్యాన్సర్ నిర్ధారణ సమయంలో, సంప్రదాయిక చికిత్సకు ముందు (ప్రీ క్యాన్సర్ ఆంకాలజీ ట్రీట్మెంట్), కీమోథెరపీ నడుస్తున్న సమయంలో, చికిత్స తరువాత (పోస్ట్ క్యాన్సర్ ఆంకాలజీ ట్రీట్మెంట్)గా ఇస్తారు. ఇంటిగ్రేటివ్ ఆంకో థెరపీ ప్రధానంగా నాలుగు రకాలుగా పనిచేస్తుంది.

ఎమోషనల్ సపోర్టు

కీమోథెరపీ, రేడియేషన్ లకు సపోర్టివ్ గా కొన్ని కాంప్లిమెంటరీ థెరపీలను కలిపి ఇస్తారు. తద్వారా భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుకోగలుగుతారు. ఇందుకోసం గైడెడ్ ఇమేజరీ అండ్ విజువలైజేషన్, మ్యూజిక్ థెరపీ అండ్ చాంటింగ్, యోగా, ప్రాణాయామం, ధ్యానం ప్రాక్టీస్ చేయిస్తారు. కౌన్సెలింగ్ ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గిస్తారు. సానుకూల భావనలను పెంపొందిస్తారు.

సైడ్ ఎఫెక్టులు తగ్గించడం

కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సలు తీసుకునేటప్పుడు వికారంగా ఉండటం, వాంతులవడం, ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పుల వంటివి బాధిస్తాయి. క్యాన్సర్ ఏదైనా ఇవి కామన్ గా ఉండే సైడ్ ఎఫెక్టులు. వీటిని తగ్గించడానికి ఇంటిగ్రేటివ్ క్యాన్సర్ థెరపీలో భాగంగా అరోమా థెరపీ కూడా ఇస్తారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో ప్రత్యేకమైన డైటింగ్ ను సూచిస్తారు. గైడెడ్ ఇమేజరీ అండ్ విజువలైజేషన్, సహజసిద్ధమైన టీ, యోగా కూడా ఈ సైడ్ ఎఫెక్టులు తగ్గించేందుకు దోహదం చేస్తాయి.

క్యాన్సర్ మళ్లీ రాకుండా…

క్యాన్సర్ కు చికిత్స తీసుకున్న తరువాత మళ్లీ రాకుండా నివారించడానికి కూడా ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ తోడ్పడుతుంది. శరీర ఇమ్యూనిటీని మెరుగుపరచడం ద్వారా తిరిగి క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. న్యూట్రిషనల్ సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా మెటాస్టాసిస్ దశలోకి వెళ్లకుండా కూడా ఆపవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన డైట్ ప్లాన్ కూడా ఇస్తారు. అరోమా థెరపీ, గైడెడ్ ఇమేజరీ అండ్ విజువలైజేషన్, ఇమ్యూనిటీ పెంచే ప్రత్యేకమైన మూలికలు, ఫార్ములేషన్లు, సుగంధ ద్రవ్యాలు, టీలు, యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివన్నీ ఇందుకు తోడ్పడుతాయి.

జీవన నాణ్యతను పెంచడం

జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటే క్యాన్సర్ వచ్చిందన్న ఆలోచన కూడా ఉండదు. జీవన నాణ్యత పెరగాలంటే శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉండటం అవసరం. యోగా, ఎక్సర్ సైజ్, ప్రాణాయామం సాధన చేయడం, సాత్వికాహారం తీసుకోవడం ఇందుకు తోడ్పడుతాయి. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. తద్వారా సానుకూల ఆలోచనలు పెంపొందుతాయి. ప్రాణిక్ హీలింగ్, సౌండ్ హీలింగ్ కూడా ఇందుకు ఉపయోగపడుతాయి. అరోమా థెరపీ, గైడెడ్ ఇమేజరీ అండ్ విజువలైజేషన్, మర్మ థెరపీ, మ్యూజిక్ థెరపీ, చాంటింగ్, సహజమైన టీలు, యోగ నిద్ర వంటివి కూడా ప్రశాంతమైన, నాణ్యమైన జీవనానికి దోహదపడుతాయి.

అందరు ఒక్కటైతేనే..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఇంటిగ్రేటివ్ క్యాన్సర్ థెరపీ అందుబాటులోకి వస్తున్నది.. అమెరికా వంటి దేశాల్లో ఇంటిగ్రేటివ్ క్యాన్సర్ థెరపీ ప్రాచుర్యంలో ఉంది. మన దేశంలో కూడా ఇలాంటి కాంప్లిమెంటరీ థెరపీలకు ప్రాచుర్యం లభించాలి. ఆంకాలజిస్టులు, ఇతర కాంప్లిమెంటరీ థెరపీ ప్రాక్టీషనర్లు పరస్పర సహకారంతో క్యాన్సర్ చికిత్స అందిస్తే వెల్ నెస్ సీకర్ల (పేషెంట్ల)కు మరింత ప్రయోజనకారిగా ఉంటుంది.

డాక్టర్ శరత్
ఛైర్మన్, కో ఫౌండర్
రాధాస్ ఆయుర్వే
మిలీనియం స్క్వేర్ బిల్డింగ్
రత్నదీప్ పైన
గచ్చిబౌలి
హైదరాబాద్
ఫోన్ : 91540 45404
Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *