సంతోషం కోసం పరుగులు తీద్దాం రండి..

మీరు సంతోషంగా ఉండాలంటే ఇదే మార్గం.. శాస్త్రజ్ఞుల కొత్త పరిశోధన

విపరీతమైన బాధ కలిగినా, కోపం, ఆవేశం వచ్చినా.. హీరో రవితేజ వేగంగా పరుగు పెడుతుంటాడు ఒక సినిమాలో.  శరీరాన్ని అలా శ్రమకు గురి చేయడం వల్ల అతనిలో భావోద్వేగాలు కంట్రోల్ లోకి వస్తాయి. ఇదే విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేశారు పరిశోధకులు.

డబ్బు బాగా సంపాదిస్తే ఆనందంగా ఉంటామా.. క్లబ్బుల్లో, పబ్బుల్లో స్పెండ్ చేస్తే సంతోషంగా ఉంటామా.. మత్తు ఎక్కేవరకూ తాగితే ఆనందంగా ఉంటామా..

కచ్చితంగా ఉండం ..

మరి సంతోషానికి మార్గం ఏది..? డబ్బు కోసం కాకుండా ఆరోగ్యం కోసం పరుగులు తీస్తే ఆనందంగా ఉంటారని చెబుతున్నారు పరిశోధకులు. శారీరక వ్యాయామం వల్ల జీవనశైలి జబ్బులయిన స్థూలకాయం, డయాబెటిస్, బీపీ, గుండెజబ్బుల వంటివి రాకుండా ఉంటాయని మనకు తెలిసిందే. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా బావుంటుందని ఇటీవలి పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. యేల్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు 1.2 మిలియన్ల మందిపై చేసిన ఈ అధ్యయన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక అయిన లాన్సెట్ లో ప్రచురితమయ్యాయి.

వ్యాయామం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి సహజమైన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేసిన వాళ్ళు ఎలాంటి నెగటివ్ పరిస్థితులు ఎదురైనా సానుకూల ధోరణితో ఉన్నట్టు గమనించారు. వాళ్ళలో ఆందోళన, డిప్రెషన్ లాంటి లక్షణాలు తగ్గుముఖం పట్టినట్టు గుర్తించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్నవాళ్ళు సాధారణ వాకింగ్ మాత్రమే కాకుండా తోటలో నడవడం, పిల్లలతో కలిసి ఆడటం, బరువులు ఎత్తడం, సైక్లింగ్, రన్నింగ్ లాంటి 75 రకాల వ్యాయామ పద్ధతుల్లో కొన్నింటిని ఎంచుకున్నారు.

ఈ అధ్యయనాన్ని బట్టి మానసికంగా సంతోషంగా, పాసిటివ్ ఆలోచనలతో, ఒత్తిడి లేకుండా ఉండాలన్నా శారీరక వ్యాయామాన్ని మించింది లేదని చెప్తున్నారు. కోట్లు సంపాదించే వాళ్ళ కన్నా రోజూ శరీరానికి పని పెట్టేవాళ్లే ఎక్కువ సంతోషంగా ఉంటున్నారని వీళ్ళు తేల్చారు.

పరిగెడితే పోయేదేముంది.. కాస్త అనారోగ్యమూ, మరికొంత ఒత్తిడి తప్ప. మరింకేం.. ఉదయాన్నే పరుగులు మొదలు పెట్టండి.. ఆరోగ్యం వైపు. మానసిక ఉల్లాసం వైపు.

Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *