రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అంటుంటారు. అంటే యాపిల్ తింటే ఇక ఏ రోగాలూ రావా.. అనే అనుమానం కలుగుతుంది. అయితే యాపిల్స్ తినడం ఆరోగ్యానికి మంచిది అనేది నిజమే గానీ యాపిల్ వల్ల ఏ రోగమూ రాదు అనడం మాత్రం అపోహే. యాపిల్ లో అనేక పోషకాలుంటాయి. విటమిన్ సి ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేగానీ ఇది రోగాల్ని మాయం చేసే మ్యాజిక్ ఫ్రూట్ ఏమీ కాదు. తీవ్రమైన ఇన్ ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఇది కాపాడలేదు. యాంటిబయాటిక్స్, యాంటి వైరల్ మందులకు యాపిల్ పండ్లు ప్రత్యామ్నాయం కాదు. అయితే దీనిలోని యాంటి ఆక్సిడెంట్స్ మాత్రం ఆరోగ్యానికీ, వెల్ బీయింగ్ కీ దోహదపడుతాయి. అందువల్ల రోజుకో యాపిల్ తింటే యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. దీనిలోని ఫైబర్ కూడా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.