చల్లగాలిలో చర్మ సౌందర్యం

చల్లగాలికి తేమ అంతా ఎగిరిపోయి, పెళుసుబారిన చర్మం… పొడిబారడం వల్ల దురద, గీతలు పడటం… చలికాలంలో చర్మాన్ని బాధించే ప్రధాన సమస్యలివి. మాయిశ్చరైజర్‌ రాసుకుంటే తప్ప చర్మం మృదువుగా కనిపించదు. చలిగాలులు చర్మంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో చర్మం ఎంత హైడ్రేట్‌ అయి ఉంటే అంత మంచిది. ఎక్కువ నీళ్లు తాగుతూ, ఎప్పటికప్పుడు చర్మం మృదువుగా ఉంటేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం నిపుణులు ఏం చెప్తున్నారంటే..

  • చల్లగాలిలో వేడి వేడి నీటితో స్నానం చేస్తుంటే ఆ హాయే వేరు. అయితే అసలే చలికాలంలోని వాతావరణం చర్మం నుంచి తేమను లాగేస్తుంది. అందువల్ల వేడినీటి స్నానం చర్మాన్ని మరింత పొడిబారుస్తుంది. అలాగని ఈ చలిలో చల్లనీళ్లతో స్నానం చేయలేం. అంతేగాక ఆస్తమా వంటి రిస్కులూ ఉంటాయి. అందువల్ల గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.
  • స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్‌ సబ్బు వాడాలి. ఇందుకోసం గ్లిజరిన్‌ బేస్‌డ్‌ సబ్బులు బాగా పనిచేస్తాయి.
  • స్నానం చేసిన తర్వాత కాస్త తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ను రాయాలి. ఇలా రోజుకు మూడు నాలుగు సార్లు రాసుకోవాలి.
  • తలస్నానానికి రెండు గంటల ముందు మాడుకు నూనె మసాజ్‌ చేసుకోవాలి. నూనె హెయిర్‌ను కండిషనింగ్‌ చేస్తుంది. పొడిజుట్టు ఉన్నవాళ్లయితే షాంపూ తర్వాత తప్పనిసరిగా కండిషనర్‌ వాడాలి.
  • తడి జుట్టును ఆరబెట్టుకోవడానికి హెయిర్‌ డ్రయ్యర్‌ వాడకపోవడమే మంచిది. ఇది చర్మాన్ని, నుదుటి పై చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది.
  • చలికాలం వాతావరణం చల్లగా ఉండేసరికి నీళ్లు ఎక్కువగా తాగము. కానీ రోజూ రెండు లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగాలి. తగినన్ని నీళ్లు తాగితే చర్మం తేమను, పటుత్వాన్ని కోల్పోకుండా గరుగ్ా లేకుండా ఉంటుంది.
  • నీటితో పాటు పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి.
  • పెదవులు పగలకుండా పెట్రోలియం జెల్లీ తప్పనిసరిగా రాయాలి. లిప్‌బామ్‌ బదులు వెన్న కూడా రాసుకోవచ్చు.
  • పాదాలు, చేతులకు కాటన్‌ గ్లౌజ్‌లు వేసుకుంటే మంచిది. పాదాలు పగులకుండా నివారించవచ్చు.

కోల్డ్‌ క్రీమ్‌.. ఏది బెస్ట్‌?
చలికాలంలో చర్మం పగుళ్ల నివారణకు కోల్డ్‌ క్రీమ్‌ వాడుతుంటాం. అయితే చాలామందికి ఎలాంటి కోల్డ్‌ క్రీమ్‌లు వాడాలో తెలియదు. మంచి వాసన ఉన్నవి చూసి తీసుకుంటుంటారు. కానీ ఈ సీజన్‌లో వాడాల్సిన కోల్డ్‌ క్రీమ్‌లు ఎంత వాసన లేకుండా ఉంటే అంత మంచివి. వాసన లేనివై ఉంటే మరీ మంచిది. అలర్జీ కలిగించని క్రీమ్‌లను ఎపంక చేసుకోవాలి. ఈ సీజన్‌లో చర్మానికి క్లెన్సర్లు వాడకూడదు. అవి చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి.

సన్‌స్క్రీన్‌ తప్పనిసరి
ఎండాకాలం మాత్రమే సన్‌స్క్రీన్‌ అవసరం అనుకుంటారు చాలామంది. కానీ ఏ సీజన్‌లో అయినా సన్‌స్క్రీన్‌ అవసరమే. ఈ చలికాలంలో పగటి ఎండ కూడా తీవ్రంగానే ఉంటుంది. అందుకే ఎండలోకి వెళ్లేవారు ట్యానింగ్‌ కాకుండా ఉండటం కోసం, సన్‌ అలర్జీలను నివారించడానికి సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పనిసరిగా వాడాలి. జిడ్డు చర్మం కలిగివుండే టీనేజ్‌ పిల్లలు ఆయిల్‌ ఫ్రీ సన్‌స్క్రీన్స్‌ రాసుకోవాలి. పొడిచర్మం ఉన్నవాళ్లు ఆయిల్‌ బేస్‌డ్‌ సన్‌స్క్రీన్స్‌ రాసుకోవాలి. ఇది ఉదయం 8 గంటలకు ఒకసారి, మళ్లీ మధ్యాహ్నం 12 తర్వాత మరోసారి రాసుకోవాలి. సన్‌స్క్రీన్‌ ఎస్‌పిఎఫ్‌ కనీసం 30 ఉండాలి. సన్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌ 40 నుంచి 50 ఉన్న క్రీములు మరింత మంచిది.

డాక్టర్‌ స్వప్నప్రియ
కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌
కేర్‌ హాస్పిటల్స్‌
హైదరాబాద్‌

Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *