ఈ ఫుడ్ మీ చర్మాన్ని మెరిపిస్తుంది..

ఆరోగ్యమైన, అందమైన చర్మాన్ని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్టీఫీషియల్ మెరుపులు అద్దుతుంటారు. అలా కాకుండా ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ఆ ఆహారపదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

ఆరోగ్యానికీ, అందానికీ సరైన మార్గం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే. ఆహారం అంటేనే ఆరోగ్యాన్నిచ్చేది. ఫాస్ట్ ఫుడ్స్ లాంటి కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలపాలు అవుతామేమో గానీ కొన్ని ఫుడ్స్ మాత్రం పోషకాలతో ఆరోగ్యాన్నిస్తాయి. చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తాయి.

చేపలు, సోయా ఉత్పత్తులు..

ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి, కుంగిబాటు, డిప్రెషన్ దూరమవుతాయి. ఈ కారణంగా చర్మం తాజాగా నిగనిగలాడుతుంటుంది.

బొప్పాయి..

విటమిన్ సి, ఇ బీటాకెరొటిన్ అధికంగా ఉండే వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మంపైన ఉండే మృతకణాలు దూరమై అందంగా మారతారు.

క్యారెట్..

విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్స్ తినడం కళ్లు, చర్మానికి ఎంతో మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల ఇన్‌ఫెక్షన్ల ప్రభావం అంతగా ఉండదని చెబుతున్నారు. వీటితో పాటు.. ఎర్ర క్యాప్సికమ్ కూడా మేలు చేస్తుందని.. ఇందులోని కెరొటినాయిడ్‌లు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. డార్క్ చాక్లెట్స్.. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఈ చాక్లెట్స్.. చర్మాన్ని మృదువుగామారుస్తాయి. పాలకూర.. శరీరంలోని వ్యర్థాలను బయటకుపంపడంలో పాలకూర బాగాపనిచేస్తుంది. కాబట్టి.. వీటిని రెగ్యులర్‌గా తీసుకుని ఆరోగ్యవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉండమంటూ వైద్యులు సూచిస్తున్నారు.

Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *