మా పెద్దమ్మ వాళ్లింట్లో బాదం చెట్టు ఉండేది. చిన్నప్పుడు కింద పడ్డ బాదం కాయల్ని ఏరుకుని పగులగొట్టుకుని తినేవాళ్లం. అలా కాయ లోంచి అప్పుడే తీసిన బాదం పప్పులను తింటే ఆ రుచే వేరు. అవునండోయ్.. బాదం గింజలు కమ్మగా, రుచిగా ఉండడమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు.
డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పులకు ఉన్న ఇంపార్టెన్సే వేరు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తినేవి బాదంపప్పులు. ఇవి రుచిగా ఉండడమే కాకుండా గుండెజబ్బుల ముప్పు కూడా తగ్గిస్తాయంటున్నారు.
బాదం గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని స్నాక్స్ గా తీసుకోవడం బెస్ట్ ఛాయిస్ అని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు. బాదం తినడం వల్ల ఎల్ డీ ఎల్ కొలెస్ట్రాల్ అంటే శరీరానికి చెడు చేసే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండెజబ్బుల ముప్పు తగ్గుతుంది.
బాదం గింజల్లో విటమిన్ ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబో ఫ్లేవిన్, మాంగనీస్, కాపర్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. రోజూ గుప్పెడు అంటే దాదాపు 23 బాదం గింజలను స్నాక్స్ గా తీసుకుంటే 161 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. 2.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అందుతాయి. వీటిలో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రొటీన్లు, ముఖ్య పోషకాలు ఉంటాయి. బాదం గింజలలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. కణాలు దెబ్బతినడం ద్వారా త్వరగా వృద్ధాప్యం దరి చేరడంతో పాటు జబ్బుల బారిన పడతారు. బాదం గింజలు తింటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది.
మంచి ఉపయోగకరమైన సమాచారం.
thank you akka