ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనాన్ని కలిగించే పండు పుచ్చకాయ. ఎండల దెబ్బ నుంచే కాదు.. అధిక రక్తపోటు నుంచి కూడా ఇది రక్షిస్తుందంటున్నారు వైద్యనిపుణులు. పుచ్చకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. ఈ కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు పుచ్చకాయలు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువగా టెన్షన్ పడడాన్నే హైపర్ టెన్షన్ లేదా హైబీపీ అంటారు. సాధారణం 120/80 కంటే ఎక్కువ రక్తపీడనం ఉండడాన్నే హైబీపీ అంటారు. 140/90 దాటితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే.. అలాంటి పరిస్థితి రాకముందే బీపీ కంట్రోల్చేసుకోవడం చాలా ముఖ్యం. ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. అందులో ఒకటే పుచ్చకాయ.
నీటిశాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయని తీసుకోవడం వల్ల హైబీపీ కంట్రోల్లో ఉంటుందని సైటింస్టులు చెబుతున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ సైంటిస్టులు చేసిన పరిశోధన ప్రకారం.. పుచ్చకాయల్లో ఉండే ఎన్నో ఔషధ గుణాలు హైబీపీని తగ్గిస్తాయని తేలింది. పుచ్చకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. ఈ కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు పుచ్చకాయలు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.