నోటి పూత లేదా నోటి లో పుండు వస్తే నోరు తెరవడం కూడా కష్టమే .
ఈ బాధ నుంచి తక్షణ ఉపశమనానికి అనేక మార్గాలున్నాయి.
- చల్లటి నీటి తో పుక్కిళించి ఉమ్మేయాలి. తర్వాత లవంగాన్ని బుగ్గన పెట్టుకొని దాని రసం పుండు మీద వచ్చేలా చేయాలి . అలా చేస్తే నొప్పి తగ్గడం తో పాటు అల్సర్ నోరంతా వ్యాపించకుండా ఆగిపోతుంది . ఉప్పునీటితో పుక్కిలిస్తే నోటి పూత తగ్గుతుంది .
- ఐదారు తులసి ఆకులను నమిలి మింగాలి . రోజులో నాలుగైదు సార్లు ఇలా చేస్తే రెండు రోజుల్లోనే అల్సర్ మాయమవుతుంది .
- నోటిపూతను , పుండ్లను తగ్గించడంలో తేనె చాలా బాగా పనిచేస్తుంది. 1 స్పూన్ తేనె ను వేలితో తీసుకొని పుండు మీద రాయాలి . పూత బాగా ఉంటే నోరంతా రాయాలి .
- వేడివల్ల కూడా కొందరిలో నోటిపూత వస్తుంది . వీళ్ళు కొబ్బరి నీటిని తాగాలి . కొబ్బరి నమిలి తింటే కూడా పూత తగ్గుతుంది . కొబ్బరినూనెను పూతమీద రాసినా ఫలితం ఉంటుంది .