పన్నునొప్పా..? ఇదిగో ఇంటి ఔషధం!

బిర్యానీకి మంచి రుచి రావాలన్నా, మసాలాకు అదనపు హంగు సమకూరాలన్నా లవంగం కీలకమైంది. వంటింట్లో వంటకాలకే కాదు, ఒంట్లో జబ్బుల నివారణకు కూడా లవంగం బాగా పనిచేస్తుంది. కడుపులో వికారానికీ, దంత ఆరోగ్యానికీ మన పోపుల డబ్బాలో లవంగం ఉంటే చాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

  • పంటి సమస్యలకు లవంగ మొగ్గ, లవంగ నూనె చక్కటి ఔషధాలు.
  • పిప్పిపన్ను నొప్పి పెడుతుందంటే లవంగ మొగ్గను చిదిమి పిప్పి ఉన్న చోట పెట్టాలి. అదేవిధంగా దూదిలో ఒక చుక్క లవంగ నూనెను వేసి, నొప్పి ఉన్న చోట వేస్తే నొప్పి తగ్గుతుంది.
  • లవంగ నూనె రక్తప్రసరణను ప్రేరేపిస్తుంది. చర్మకణాలను ఉత్తేజపరుస్తుంది.
  • లవంగాన్ని మెత్తగా నూరి, మొటిమల మీద రాస్తే, మొటిమ పక్కకు విస్తరించకుండా త్వరగా రాలిపోతుంది. ఇలా రాసేటప్పుడు మొటిమ పక్కన సాధారణ చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాలి.
  • వాంతి అవుతుందనిపించినప్పుడు లవంగాన్ని వాసన చూడాలి. అలాగే లవంగం రసాన్ని చప్పరించినా ఫలితం ఉంటుంది.
  • దగ్గు వదలకుండా బాధిస్తుంటే లవంగం మొగ్గను బుగ్గన పెట్టుకుని మెల్లగా నములుతూ రసం మింగాలి.
  • లవంగాలు ఇ‌న్‌ఫెక్షన్ల నివారణలో సహకరిస్తాయి. ఎందుకంటే వీటిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీవైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీసెప్టిక్‌ గుణాలున్నాయి.
  • లవంగాలు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అంతేగాక లవంగాలు గుండెపోటు రాకుండా నివారించడంలో కూడా పరోక్షంగా సహకరిస్తాయి. ఎందుకంటే ఇవి రక్తాన్ని పలుచబరుస్తూ గడ్డ కట్టకుండా (బ్లడ్‌ క్లాట్స్‌) నివారిస్తాయి.

Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *