అల్లం.. ఆరు ఆరోగ్య సూత్రాలు

అల్లం, వెల్లుల్లి లాంటివి ఇంట్లో ఉంటే అనేక రకాల రుగ్మతల నుంచి తప్పించుకోవచ్చంటారు మన పెద్దవాళ్లు. వీటిలో ఉండే ఔషధ గుణాలను ఆధునిక వైద్య శాస్త్రం కూడా రుజువు చేసింది. కొందరు వెల్లుల్లిని వాడరు గానీ వంటల్లో అల్లం వాడని వాళ్లు అరుదు. అల్లం అమ్మ లాగా అక్కున చేర్చుకుని ఆరోగ్యాన్నిస్తుంది. అలాంటి వాటిలో ఓ ఆరు…

కొవిడ్ కి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఒళ్లు నొప్పులు కనిపిస్తున్నాయి. జలుబు కూడా ఉంటోంది. జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గడానికి డోలో వేసుకోమంటున్నారు డాక్టర్లు. కొందరు ఇతర పెయిన్ కిల్లర్లు వాడే ప్రమాదం కూడా ఉంది. కానీ ఈ టాబ్లెట్ల గోలే లేకుండా ఇంట్లో అల్లం ఉంటే చాలు. రకరకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. రోజూ అల్లం తీసుకుంటే నొప్పులను తట్టుకునే శక్తి పెరుగుతుందట.
జలుబును తగ్గించే మంత్రం అల్లం దగ్గరుందని మనకు ఎప్పటి నుంచో తెలుసు. ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలని రెండు కప్పుల నీటిలో వేసి 10 నిమిషాలపాటు మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లారబెట్టాలి. ఈ అల్లం నీటిలో తేనే కలుపుకొని రోజులో రెండు సార్లు త్రాగితే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. 
ప్రతి రోజూ అల్లం తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అందుకే కొవిడ్ మళ్లీ ఎక్కువవుతున్న నేపథ్యంలో అల్లం వాడకాన్ని పెంచాలని సూచిస్తున్నారు ఆయుర్వేద వైద్యులు.
జలుబు తర్వాత జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలకు అల్లం బాగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న ఔషధ గుణాలు పొట్టలో గ్యాస్ ని బయటకు పంపిస్తాయి. దాంతో కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటివి తగ్గిపోతాయి. 
అల్లం అధికబరువుని తగ్గించి, చెడుకొలెస్ట్రాల్‌ని దూరం చేసి, రక్త ప్రసరణ సరిగా ఉండేలా చూసి 
గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. అందుకే మన రోజువారీ వంటకాల్లో అల్లం వేయడం మరవొద్దు.
వ్యాయామం చేసినప్పుడు కండరాలు అలసిపోతాయి. మళ్లీ వాటిని సాధారణ స్థితికి తీసుకురావాలంటే ఒక గ్లాసు అల్లం నీటిని  వ్యాయామం తరువాత తాగాలి. చాలా తక్కువ సమయంలోనే ఫలితం కనిపిస్తుంది. అల్లం రసం తాగిన తర్వాత చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.
Spread the love

Recommended For You

About the Author: Go Family Doctor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *