ఆధునిక వైద్యరంగం ఎప్పటికప్పుడు కొత్త కొత్త చికిత్సలను తీసుకువస్తున్నది. అయితే ప్రతిదానికీ కొన్ని పరిమితులు ఉంటాయి. ఓపెన్ హార్ట్ సర్జరీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన స్టెంటింగ్ ప్రక్రియ కూడా కొన్నిసార్లు మళ్లీ సమస్యను తెచ్చిపెట్టొచ్చు. ఇలాంటప్పుడు బైపాస్ సర్జరీనే మంచి పరిష్కారం అవుతుంది. ఇందుకు నిదర్శనం బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ లో చేసిన క్వాడ్రిపుల్ కరొనరీ బైపాస్ సర్జరీ.
హేమంత్ అనే వ్యక్తికి గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నట్టు గుర్తించి స్టెంట్లు వేశారు ఢిల్లీ వైద్యులు. కానీ మూడు నెలలు తిరక్కుండానే అతడికి మళ్లీ ఛాతి నొప్పి వచ్చింది. సంక్లిష్టమైన గుండె ఆపరేషన్లు చేసి సక్సెస్ అయ్యారని తెలుసుకుని, హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ దగ్గరికి తీసుకొచ్చారు అతని కుటుంబ సభ్యులు.
గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు ఛాతిలో నొప్పి వస్తుంది. హేమంత్ కి కూడా మొదటి సారి ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు వెంటనే స్టెంట్లు వేసి, ఆ బ్లాక్స్ ను తొలగించారు. కానీ సాధారణంగానే స్టెంటు వేసినప్పుడు ఏడాదిలోగా మళ్లీ బ్లాక్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. అలాంటిది హేమంత్ కి డయాబెటిస్ కూడా ఉంది. డయాబెటిస్ ఉన్నవాళ్లలో స్టెంటింగ్ తర్వాత కూడా మళ్లీ బ్లాక్స్ ఏర్పడే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
హేమంత్ ని పరీక్షించిన తర్వాత వెంటనే ఆంజియోగ్రామ్ చేశారు. గుండెలో ప్రధానమైన రక్తానాళంతో పాటు, ఇతర రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ ఉన్నట్టు గుర్తించారు. స్టెంట్స్ వేసిన చోటే మళ్లీ బ్లాక్స్ రావడంతో హేమంత్ పరిస్థితి చాలా క్రిటికల్ అయింది. ఇలాంటప్పుడు మళ్లీ స్టెంటు వేయడం వల్ల ఉపయోగం లేదు. ప్రాణాంతక పరిస్థితిని గుర్తించిన వెంటనే బైపాస్ సర్జరీ చేయడానికి నిర్ణయించారు. అది కూడా కొత్త విధానమైన క్వాడ్రాపుల్ కరొనరీ బైపాస్ సర్జరీ.
క్వాడ్రాపుల్ కరొనరీ బైపాస్ సర్జరీ అంటే…
స్టెంట్ వేసిన తర్వాత 12 శాతం మందిలో సంవత్సరం తిరిగే సరికల్లా మళ్లీ బ్లాక్స్ ఏర్పడవచ్చు. కానీ బైపాస్ సర్జరీ చేయించుకుంటే కేవలం ఒక శాతం మాత్రమే రిస్కు ఉంటుంది. అంతేగాకుండా మళ్లీ ఇరవయ్యేళ్ల వరకూ బ్లాక్స్ ఏర్పడవు. కాబట్టి ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవాళ్లకు బ్లాక్స్ తొలగించడానికి స్టెంట్ వేసే బదులుగా బైపాస్ సర్జరీ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అందుకే హేమంత్ కి బైపాస్ సర్జరీ ఎంచుకున్నారు. హేమంత్ కి నాలుగు చోట్ల బ్లాక్స్ ఉండటం వల్ల నాలుగు బైపాస్ లు చేయాల్సి వచ్చింది. దీన్నే క్వాడ్రిపుల్ కరొనరీ బైపాస్ సర్జరీ. అయితే ఇది సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీ కాదు.
ఈ సర్జరీ ప్రత్యేకత ఏంటంటే..
సాధారణ సర్జరీ అయితే తాత్కాలికంగా గుండెను ఆపి, సర్జరీ చేస్తారు. కానీ హేమంత్ కి బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీ చేశారు. అంటే గుండె కొట్టుకుంటూ ఉండగానే ఇంకోవైపు సర్జరీ నిర్వహించారన్నమాట. మయోకార్డియల్ స్టెబిలైజర్ అనే ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగించి, గుండె కొట్టుకుంటూ ఉండగానే సర్జరీ చేయవచ్చు. సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీకి పెద్ద కోత అవసరం. కానీ క్వాడ్రిపుల్ కరొనరీ బైపాస్ ద్వారా పెద్ద కోత అవసరం లేదు. కాబట్టి హేమంత్ 36 గంటల్లోనే పూర్తిగా కోలుకున్నాడు.